మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 18:10:15

రేపు రాత్రి నగరంలో ఆంక్షలు.. బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా అన్ని మూసివేత

రేపు రాత్రి నగరంలో ఆంక్షలు..  బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా అన్ని మూసివేత

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్‌, హైదరాబాద్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసుశాఖ ఆంక్షలు విధించింది. రేపు రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం ఉదయం  5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సైబరాబాద్‌, హైదరాబాద్‌ డీసీపీలు తెలిపారు. సైబర్‌ టవర్స్‌, గచ్చిబౌలి, బయోడైవరిర్సటీ ఫ్లేఓవర్లు, జేఎన్‌టీయూ, మైండ్‌స్పేస్‌, దుర్గం చెరువు తీగల వంతెనలను మూసివేయనున్నట్లు పేరొన్నారు.

బేగంపేట ఫ్లైఓవర్‌ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కార్లు, జీపులను అనుమతించబోమని చెప్పారు. నెక్లెస్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ మార్గ్‌, బీఆర్‌కే భవన్‌, తెలుగు తల్లి కూడలి, లిబర్టీ జంక్షన్‌, నల్లగుట్ట రైల్వే వంతెన వద్ద వాహనాలను దారి మళ్లించనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. యువత ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo