మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 02:46:41

ఆలోచనలు మార్చాల్సిన అవసరం

ఆలోచనలు మార్చాల్సిన అవసరం

  • ‘బోకెట్స్‌ అండ్‌ బ్రిక్‌బ్యాట్స్‌' 
  • పుస్తకావిష్కరణలో బీ వినోద్‌కుమార్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చైతన్యాన్ని ప్రభావితం చేసే ప్రాథమిక విలువలను పునరుద్ధరించడం, సంస్కరించడం అవసరమని ప్రణాళికాసంఘం వైస్‌చైర్మన్‌ బీ వినోద్‌కుమార్‌ తెలిపారు. అన్ని బ్లాగులు, స్నిప్పెట్ల లక్ష్యం సుపరిపాలనే అని పేర్కొన్నారు. శనివారం టీపీఎస్సీ మాజీసభ్యుడు వివేక్‌తో కలిసి ‘బ్రోకెట్స్‌ అండ్‌ బ్రిక్‌ బ్యాట్స్‌' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విభిన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలపై బ్లాగుల సమాహారం ఈ పుస్తకమని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. మన ఆలోచనలను మార్చాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం తెలియజేస్తున్నదని చెప్పారు. పుస్తక రచయిత కనగిరి ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఆలోచనలు, సామాజిక అంశాలపై అభిప్రాయాలు మనల్ని ఆత్మపరిశీలన వైపు ప్రేరేపిస్తాయని చెప్పారు. logo