గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 01:17:09

అనాథలకు దాతల అండ

అనాథలకు దాతల అండ

  • ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన

చిగురుమామిడి: తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లికి చెందిన మంద అశ్రిత, స్ఫూర్తి, రిశ్వంత్‌కు చేయూతనిచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ‘అనాథలు... ఆ చిన్నారులు’ శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి స్పందించిన హైదరాబాద్‌కు చెందిన విద్యుత్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పీ అంజయ్య ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు రూ.50వేల నగదును బుధవారం చిన్నారులకు అందజేశారు. logo