పర్యాటక ప్రాంతాలుగా రిజర్వాయర్లు

- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, మిడ్‌మానేరు, కోయిల్‌సాగర్, కరివేన, ఉదండాపూర్, లక్నవరం వంటి రిజర్వాయర్ల వద్ద టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. సోమశిల, పాకాలలో టూరిజం అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం పర్యాటకం-గ్రామీణాభివృద్ధిపై టూరిజం అనుబంధ సంస్థల వారితో వెబ్‌నార్ నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం రవీంద్రభారతిలోని కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడు తూ.. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. పర్యాటకుల కోసం విశేషసేవలు అందించిన టూరిజం అనుబంధ సంస్థలకు అవార్డులను అందించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలను రూపొందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అద్భుత అవకాశాలు ఉన్నాయన్నారు. బుద్ధవనం ప్రాజెక్టులో భాగంగా నాగార్జునసాగర్, ఫణిగిరి, కోటిలింగాలలో అనేక ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని అతిపెద్ద కేసీఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్క్, వికారాబాద్‌లోని అనంతగిరి నుంచి నల్లమల వరకు ఉన్న ఎకో పార్కులు, బొగత, కుంటాల, పొచ్చెర వంటి జలపాతాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు.
తాజావార్తలు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
- ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం
- ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి.. రైళ్లు ఆలస్యం
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
- ‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది