సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 18:26:09

రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : మే నెల కల్లా నష్కల్ (ఉప్పుగల్‌) రిజర్వాయర్ పనులు పూర్తి అవుతాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద జఫర్ గడ్ మండలం ఉప్పుగల్‌లో నిర్మించనున్న నష్కల్‌ జర్వాయర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రిజర్వాయర్‌ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉప్పుగల్ రిజర్వాయర్ ని రూ.325 కోట్లతో చేపట్టాం. ఇప్పటికే దాదాపు పని పూర్తి కావచ్చిందన్నారు.

దీంతో మొత్తం 45,210 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందుతాయన్నారు. దేవాదుల, కాళేశ్వరం, ఎస్సారెస్పీ కాలువల ద్వారా గతంలో ఎడారిని తలపించిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. ప్రతి నీటి చుక్కను ఆఖరి ఎకరా వరకు అందించాలన్నదే సీఎం కేసిఆర్ లక్ష్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తెస్తుంటే, సీఎం కేసీఆర్ మాత్రం రైతు సంక్షేమానికే కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.