మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 21, 2020 , 01:52:35

రామన్నగట్టులో రిజర్వాయర్‌

రామన్నగట్టులో రిజర్వాయర్‌

  • 24 గ్రామాలకు నీరందేలా ప్రణాళిక 
  • మంత్రి సింగిరెడ్డి వెల్లడి.. ప్రతిపాదిత స్థల పరిశీలన

పాన్‌గల్‌: రామన్నగట్టులో నూతన రిజర్వాయర్‌ ఏర్పాటుచేసి రైతుల చిరకాల కోరికను నెరవేరుస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలం కిష్టాపూర్‌ సమీపంలో రామన్నగట్టు రిజర్వాయర్‌ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రామన్నగట్టు రిజర్వాయర్‌తో దాదాపు మండలంలోని 24 గ్రామాల రైతులకు సాగునీరందుతుందని చెప్పారు. డీ-8 కాల్వ ద్వా రా వచ్చే నీటిలో ఒక టీఎంసీ వరకు నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పారు. ఇంజినీరింగ్‌ అధికారులతో సర్వే చేయించి  రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపు తామన్నారు. ప్రతిపాదిత స్థలంలో అటవీ భూములుంటే అనుమతులు తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని చెప్పారు. మంత్రి వెంట కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మునీర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు.


logo
>>>>>>