సోమవారం 01 జూన్ 2020
Telangana - May 19, 2020 , 17:51:26

ఉద్యోగం లేదని ఉసురు తీసుకున్నాడు

ఉద్యోగం లేదని ఉసురు తీసుకున్నాడు

హైదరాబాద్‌: అతను ఒక ఉన్నత విద్యావంతుడు. రిసెర్చ్‌ స్కాలర్‌. ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేశాడు. ఇంత చదువున్నా అతనికి చాలాకాలంగా ఉద్యోగం దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఉరేసుకుని ఊపిరి తీసుకున్నాడు. మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్ ప్రాంతానికి చెందిన రవిందర్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం నగరం అంతటా చెప్పులు అరిగేలా తిరిగాడు. అయిన ఎక్కడా అతనికి ఉద్యోగం దొరకలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందాడు. సోమవారం రాత్రి బోడుప్పల్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


logo