మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 02:31:06

సాగునీటి యాజమాన్యంపై పరిశోధనా కేంద్రం

సాగునీటి యాజమాన్యంపై పరిశోధనా కేంద్రం
  • కేంద్రానికి మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిపాదన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పెరుగుతున్న నీటిపారుదల సౌకర్యాల నేపథ్యంలో రైతులకు నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం ఏర్పాటుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అదేవిధంగా జగిత్యాలలో ఆవాల పంట పరిశోధన కేంద్రం కూడా నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమర్‌కు సోమవారం మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిపాదనలు పంపారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో సాగుకు సమృద్ధిగా నీరు అందుతున్నదని, కోటి ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ వైపు తెలంగాణ అడుగులు పడ్డాయని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన సాగునీరును సమర్థంగా వాడుకొనేందుకు నీటి వినియోగ పరిశోధనా కేంద్రం ఏర్పాటు అవసరమన్నారు. logo
>>>>>>