శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 17:34:43

కమాన్‌పూర్ దవాఖాన సామర్థ్యాన్ని పెంచాలని మంత్రికి వినతి

కమాన్‌పూర్ దవాఖాన సామర్థ్యాన్ని పెంచాలని మంత్రికి వినతి

పెద్దపల్లి : జిల్లాలోని కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 బెడ్లకు పెంచాలని జెడ్పీ చైర్‌పర్సన్ పుట్ట మధుకర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు మధుకర్ తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.