ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 12:46:51

రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి : మంత్రి కొప్పుల

రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ కృషి : మంత్రి కొప్పుల

పెద్దపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తూ.. వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన రైతు బైరి రాజేశం అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా. రైతు బీమా ద్వారా రూ. 5లక్షలను మంత్రి మంజూరు చేయించారు.

కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో బాధిత రైతు భార్య బైరి సరోజకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతుబీమా ద్వారా రైతు చనిపోయిన 8 రోజుల్లోనే రూ.5 లక్షలను ప్రభుత్వం రైతు అకౌంట్‌లో జమ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మొర సుధాకర్, గ్రామ టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల తిరుపతి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.