బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 28, 2020 , 12:34:56

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని మంత్రికి వినతి

నిర్మల్‌ : జిల్లాలోని దీలవార్‌పూర్ మండలం సాంగ్వి గ్రామస్తులు బుధవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని నిర్మల్ క్యాంపు కార్యాలయంలో కలిసి పలు అభివృద్ధి పనుల కోసం వినతిపత్రం ఇచ్చారు. సాంగ్వి గ్రామంలో రోడ్డు కోసం రూ.20 లక్షలు, మాత అన్నపూర్ణేశ్వర స్వామి ఆలయం వద్ద రేకుల షెడ్డుకు రూ.10 లక్షలు, మల్లాపూర్‌లో రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలు, మొత్తం రూ.40 లక్షల నిధులు మంజూరు చేయాలని వారు మంత్రిని కోరారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ నిచ్చారు. మంత్రిని కలిసిన వారిలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్ రావు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.