సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 12:54:34

వారిపై చర్యలు తీసుకోండి.. హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ ట్వీట్‌

వారిపై చర్యలు తీసుకోండి.. హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ : వనపర్తిలో ఓ వ్యక్తిపై  పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా సదరు వ్యక్తి కొడుకు కళ్లెదుటే చోటుచేసుకుంది. అంకుల్‌.. ప్లీజ్‌ అంకుల్‌ కొట్టద్దండి అంకుల్‌ అంటూ ఏడుస్తూ ఆ బాలుడు బతిమాలినా వదల్లేదు. ఆ వ్యక్తితోపాటు ఆ పిల్లాన్ని కూడా పోలీసు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు.   ఘటనను ఓ నెటిజన్‌ వీడియో తీసి మంత్రి కేటీఆర్‌కు ట్విట్‌ చేశారు. పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. స్పందించిన కేటీఆర్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ పోలీసులు ప్రవర్తించిన తీరు అంగీకారయోగ్యం కాదన్నారు. ఇటువంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. వేల మంది పోలీసులు ఎంతో కష్టపడి సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇటువంటి కొంతమంది ప్రవర్తన కారణంగా మిగతా వారి శ్రమంతా వృథాఅవుతదన్నారు.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo