శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 25, 2020 , 19:46:55

హాస్టల్స్‌ నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దు : కేటీఆర్‌

హాస్టల్స్‌ నుంచి ఎవరినీ ఖాళీ చేయించొద్దు : కేటీఆర్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలోని హాస్టల్స్‌ నుంచి ఎవరిని ఖాళీ చేయించొద్దని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హాస్టల్స్‌ నుంచి విద్యార్థులను నిర్వాహకులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూ దిక్కుతోచని విద్యార్థులు వందల సంఖ్యలో ఆయా ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. తమ సమస్యను విన్నవిస్తూ పలువురు మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... హాస్టల్స్‌ నిర్వాహకులెవరూ విద్యార్థులను ఖాళీ చేయించొద్దన్నారు. 

మీకు కావాల్సిన సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే నగర మేయర్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. మీకు ఎటువంటి సమస్యలు రావన్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికారులతో కలిసి తమ తమ ప్రాంతాల్లోని వసతి గృహాలను సందర్శించి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనవసర భయాందోళనకు కారణం కావొద్దన్నారు. 



logo