శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 14:28:32

ఎమ్మెల్సీ కవితని కలిసిన సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు

ఎమ్మెల్సీ కవితని కలిసిన సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు

నిజామాబాద్‌ : జిల్లా సర్పంచ్‌ల ఫోరం ప్రతినిధులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని హైదరాబాద్‌లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గత ఆరేండ్లుగా గ్రామాల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ సర్పంచ్‌లకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా సర్పంచ్‌లు కృతజ్ఞతలు తెలిపారు. 

సర్పంచ్‌లు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సర్పంచ్‌లు పలు వినతులను ప్రస్తావించగ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన కవిత హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అసోల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యెడ్ల రాజేశ్వర్ రెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.


logo