గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 14, 2020 , 01:45:51

గంగదేవిపల్లికి అంతర్జాతీయ ఖ్యాతి

గంగదేవిపల్లికి అంతర్జాతీయ ఖ్యాతి
  • గ్రామాన్ని సందర్శించిన 16 దేశాల ప్రతినిధులు
  • అభివృద్ధి పనుల పరిశీలన

గీసుగొండ: జాతీయస్థాయిలో ఆదర్శ గ్రామమైన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లిని గురువారం 16 దేశాల ప్రభుత్వ ఉద్యోగులు సందర్శించారు. భూటాన్‌, ఈజిప్టు, కెన్యా, నమీబియా, నేపాల్‌, నైజీరియా, అమెన్‌, పాలస్తీనా, సౌత్‌సుడాన్‌, శ్రీలంక, టాంజానియా, జాంబియా, కజకిస్థాన్‌, ఉగాం డా, మారీషస్‌, ఇథియోపియా దేశాల నుంచి 27 మంది ప్రభుత్వ ఉద్యోగుల బృందం ఆ గ్రామంలో పర్యటించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంతోపాటు ప్రభుత్వపాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, పల్లెప్రగతి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులను వారు పరిశీలించారు. 


ఈ సందర్భంగా జిల్లా శిక్షణ మేనేజర్‌ కూసం రాజమౌళి గంగదేవిపల్లి ప్రగతి, సాధించిన అభివృద్ధిని వారికి వివరించారు. గంగదేవిపల్లి గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉన్నదన్నారు. ఇక్కడ మద్యపానం పూర్తిగా నిషేధమని, ప్రజలందరూ వ్యక్తిగత మరుగుదొడ్లు వాడుతున్నట్టు చెప్పా రు. ఇంకుడుగుంతలు, ఫాంపాండ్స్‌ను వంద శాతం నిర్మించుకున్నట్టు తెలిపారు. వందశాతం పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని చెప్పారు. వీరివెంట జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు ఇంచార్జి భట్టాచార్య, సర్పంచ్‌ గోనె మల్లారెడ్డి, బాలవికాస సంస్థ కోఆర్డినేటర్‌ సింగారెడ్డి సునీత, వివిధ కమిటీల సభ్యులు ఉన్నారు.


logo