రేపు ఓల్డ్ మల్పేట డివిజన్లో రీపోలింగ్

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మల్పేట డివిజన్లో గురువారం రీ పోలింగ్ నిర్వహించనున్నారు. 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇక్కడ అభ్యర్థుల గుర్తులను అధికారులు తప్పుగా ముద్రించడంతో రెండు గంటల తరువాత సీపీఐ నాయకులు గుర్తించి ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఇక్కడ సీపీఎం మద్దతుతో సీపీఐ బరిలో నిలిచింది. సీపీఐ గుర్తు కంకి కొడవలి కాగా సీపీఎం గుర్తు సుత్తి కొడవలి ముద్రించారు. ఈ డివిజన్లో మొత్తం 54,655 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 27,889 పురుషులు.. 26,763 మంది మహిళలు. రీపోలింగ్ కోసం 12 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 23 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు