మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 22, 2020 , 00:05:41

గురుకుల డిగ్రీ కళాశాలల్లో 34 ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీ

గురుకుల డిగ్రీ కళాశాలల్లో 34 ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీ
  • మార్చి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 34 ప్రిన్సిపల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవాలని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు (టీఆర్‌ఈఐ-ఆర్బీ) శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ పరిధి మహిళా డిగ్రీ కళాశాలల్లో ఇదివరకే అనుమతించిన 19, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ గురుకుల మహిళా, సాధారణ డిగ్రీ కళాశాలల పరిధిలో కొత్తగా కేటాయించిన 15 ప్రిన్సిపల్‌ పోస్టులు భర్తీచేయాలని నిర్ణయించారు. ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.  పూర్తి వివరాలకు www.treirb.net www. treirb.net, www.telangana.gov.in www.telangana.gov.in  వెబ్‌సైట్లను పరిశీలించాలని, ఇతర సమాచారం కోసం 040-23317140 నంబర్‌లో సంప్రదించాలని, విద్యార్హతలున్న అభ్యర్థులు మార్చి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసుకోవాలని టీఆర్‌ఈఐ-ఆర్బీ సూచించింది.


logo