ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ : ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు బండా ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ప్రతిపక్ష నేతలు అబద్ధాలు చెప్పడంలో నంబర్ వన్. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. ఎప్పుడు మనకు కనపడని వాళ్ళు ఈ రోజు వస్తున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అనేక నిధులు తీసుకువచ్చాం. వరంగల్‌కు వరదలు వస్తే మనం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తే ప్రతిపక్షాలు కనుచూపు మేరలోనైనా కనిపించాయా? అని ప్రశ్నించారు. మనం చేసే అభివృద్ధిని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు మంత్రి ఘన సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీస్ అధికారి శ్యామ్ సుందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా శాయంపేట ఆదిత్య అధ్వర్యంలో 50 మంది టీఆర్ఎస్లో చేరారు. వీళ్లందరికి గులాబీ కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
తాజావార్తలు
- ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి కన్నుమూత
- ఇది సంక్రాంతి విజయం కాదు.. నిర్మాతలకు పెరిగిన నమ్మకం
- బీఈడీ తొలి విడుత సీట్లు కేటాయింపు
- ‘సలార్’లో యశ్ ఉన్నాడా..! పాన్ ఇండియన్ స్టార్స్ కలుస్తున్నారా..?
- ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి..
- శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్ సమీక్ష
- ‘కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పక్కాగా చేపట్టాలి’
- బీటీపీఎస్ 3వ యూనిట్ సింక్రనైజేషన్ సక్సెస్
- పండుగవేళ కేటీఆర్‌పై అభిమానం..
- టీఆర్పీ స్కాం: రిపబ్లిక్ టీవీ సీఈవో గోస్వామి జైలుకెళ్లాల్సిందే