శనివారం 06 జూన్ 2020
Telangana - May 21, 2020 , 23:14:28

మండుటెండల్లోనూ మత్తడి..పరిశీలించిన ఎమ్మెల్యే రసమయి

మండుటెండల్లోనూ మత్తడి..పరిశీలించిన ఎమ్మెల్యే రసమయి

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక పెద్ద చెరువు ఎండాకాలంలోనూ మత్తడి దూకుతున్నది. ఇవాళ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పెద్ద చెరువు మత్తడిని ‌పరిశీలించారు. వర్షాకాలానికి ముందే మత్తడి దుంకుతుండడంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ రిజర్వాయర్‌ ద్వారా వారం క్రితం కాలువ ద్వారా నీటిని విడుదల చేయగా.. కాళేశ్వరం జలాలతో రేపాక పెద్ద చెరువు నిండుకుండను తలపిస్తుంది. మండలంలో 11 సంవత్సరాలుగా ఏ చెరువూ నిండి మత్తడి దుంకిన దాఖలాలు లేవని, ముఖ్యమంత్రి దయవల్ల గోదారమ్మ తమ ఊళ్లకు వచ్చి మండుటెండల్లోనూ మత్తళ్లను పారిస్తున్నదని మండల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. నీటి విడుదలకు సహకరించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డితో పాటు మండల ప్రజాప్రతినిధులు ఉన్నారు.  ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo