సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 17:15:02

యాదాద్రిలో నూతన ఘాట్‌రోడ్డు పునఃప్రారంభం

యాదాద్రిలో నూతన ఘాట్‌రోడ్డు పునఃప్రారంభం

యాదాద్రి భువనగిరి :  శ్రీలక్ష్మీనరసింహస్వామివారి కొండపైకి వెళ్లేందుకు నూతనంగా గౌడ సత్రం వద్ద నిర్మించిన ఘాట్‌రోడ్డు మంగళవారం ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. గతేడాదిలోనే ఘాట్‌రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకురాగా, తుర్కపల్లి నుంచి యాదాద్రికి ఫోర్‌లైన్‌ రోడ్ల వెడల్పు నిమిత్తం ఘాట్‌రోడ్డు వద్ద తవ్వకాలు జరిపారు. దీంతో ఘాట్‌రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. 

తాజాగా రోడ్డు పనులు పూర్తికావడంతో పాటు కార్తీకమాసంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇటు భక్తుల వాహనాలు, ఆటు ఆలయ పనుల్లో నిమగ్నమైన వాహనాలకు ఎలాంటి ఆటంకం కలుగుకుండా ఉండేలా ఆలయ అధికారులు ఘాట్‌రోడ్డును ప్రారంభించారు. ఇప్పటికే వాహనపూజల వద్ద ఉన్న ఘాట్‌రోడ్డుతో పాటు తాజాగా ప్రారంభమైన మరో ఘాట్‌రోడ్డు భక్తులకు రవాణా సేవలను అందించనున్నాయి.