బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 19:33:39

మొక్కలు నాటిన ప్రముఖ గుండె నిపుణులు ప్రమోద్‌ కుమార్‌

మొక్కలు నాటిన ప్రముఖ గుండె నిపుణులు ప్రమోద్‌ కుమార్‌

హైదరాబాద్‌ : ప్రముఖ గుండె నిపుణులు, యశోద హాస్పిటల్‌ డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటారు. బొంతు శ్రీదేవి విసిరిన గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రమోద్‌ కుమార్‌ నేడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిందన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో తాను భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ వంటి కాంక్రిట్‌ జంగల్‌లో పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.

భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం అందించేందుకు ప్రతిఒక్కరూ విధిగా మూడు మొక్కలు నాటాలన్నారు. కాలుష్యం ఉన్న గాలిని పీల్చడం వల్ల హుద్రోగ సమస్యలు పెరుగుతాయన్నారు. మొక్కలు నాటడం వల్ల మంచి గాలి దొరుకుతుందన్నారు. అనంతరం ప్రమోద్‌ కుమార్‌ మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. సినీ నటుడు సాయిచంద్‌, హైకోర్టు న్యాయవాది వై.రామారావు, ప్రముఖ రేడియాలజీ చీఫ్‌ అపోలో హాస్పటల్‌ డాక్టర్‌ సత్యప్రసాద్‌లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. logo