మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 01:37:17

చిన్నారి శరీరం నుంచి సూదులు తొలిగింపు

చిన్నారి శరీరం నుంచి సూదులు తొలిగింపు

వనపర్తి వైద్యం: మూడేండ్ల చిన్నారి శరీరం నుంచి ఎ నిమిది సూదులను వైద్యు లు తొలిగించారు. మొత్తం పది సూదులు ఉండగా .. ఎనిమిందింటిని శస్త్రచికిత్సచేసి తీశారు. వనపర్తి జి ల్లా వీపనగండ్లకు పెబ్బేటి అశోక్‌కుమార్‌, అన్నపూర్ణ దంపతుల కుమారుడు లోకనాథ్‌.. తీవ్రనొప్పితో ఏడుస్తుండగా సోమవారం కుటుంబసభ్యులు వనపర్తిలోని దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఎక్స్‌రేతీసి శరీరంలో 10 సూదులు ఉన్నట్టు గుర్తించారు. 


మంగళవారం వనపర్తిలోని సుధ నర్సింగ్‌ హోంలో వైద్యులు బాలుడికి శస్త్రచికిత్సచేసి ఎనిమిది సూదులను తొలిగించారు. బాలుడి శరీరంలో ఇంకా రెండు సూదులు ఉన్నాయని, అవి మలం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉన్నదని వైద్యులు చెప్పారు. చిన్నారి శరీరంలోకి ఎవరన్నా బలవంతంగా సూదులు గుచ్చారేమోనన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


logo