ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 10:42:28

ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

ఆస్పత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

హన్మకొండ: వరంగల్‌ సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీ ఒకరు పరారయ్యాడు. 14 చోరీ కేసుల్లో నిందితుడైన హన్మకొండ పట్టణం సుబేదారి ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టుకు పంపగా రిమాండ్‌  విధించింది. దీంతో  అతడిని కొన్నిరోజుల క్రితం వరంగల్ సెంట్రల్‌ జైలుకు తరలించారు.

రెండు రోజుల క్రితం అతడికి కరోనా అనుమానంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆస్పత్రి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్న రిమాండ్‌ ఖైదీ కోసం విస్తృతంగా పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo