హైదరాబాద్: కరోనా రెండోదశ విజృంభణ నేపథ్యంలో బయటకెళ్లలేని వృద్ధులు మందులు తెచ్చుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఒంటరిగా ఉండడం, మరికొందరు బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి వారికోసం సేవలందించేందుకు హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ సభ్యులు ముందుకొచ్చారు. ‘రిలీఫ్ రైడర్స్’ పేరుతో సుమారు 40 మంది సైక్లిస్టులు నగరవ్యాప్తంగా వృద్ధులకు ఇంటివద్దే మందులు అందజేయనున్నట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ మేయర్ సాంతన్, సైక్లిస్ట్ రవి తెలిపారు. ఈ సేవలు పొందాలనుకునేవారు 9629557866, 9566170334 నంబర్లకు ఫోన్ చేసి మందుల వివరాలు, ఇంటి చిరునామా స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..