ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 06:58:20

వాహన, ఆరోగ్యబీమా పాలసీదారులకు ఊరట

వాహన, ఆరోగ్యబీమా పాలసీదారులకు ఊరట

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహన, ఆరోగ్య పాలసీదారుల ప్రీమియం చెల్లింపు గడువు పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది. పాలసీల గడువు ముగిసినా బీమా వర్తిస్తుందని గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 14 మధ్య చెల్లింపులు చేయాల్సిన వాహన, ఆరోగ్య పాలసీదారులకు భారీ ఊరట లభించనున్నది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్‌ 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు, ప్రీమియం బకాయిల మొత్తాన్ని ఏప్రిల్‌ 21 లేదా అంతకన్నా ముందుగానీ చెల్లించవచ్చని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పాలసీదారుల పునరుద్ధరణ ప్రీమియాన్ని సకాలంలో చెల్లించలేకపోతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన మోటారు వాహనం థర్డ్‌పార్టీ బీమా కవరేజీని కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏప్రిల్‌ 21ని పాలసీ పునరుద్ధరణ తేదీగా పరిగణించాలని, ఆరోగ్య బీమా పాలసీల్లో కూడా ఇదే వర్తించనున్నదన్నారు. రోడ్‌ ట్యాక్సీ చెల్లింపుకూడా వాయిదా వేస్తున్నట్టు రవాణాశాఖ ప్రకటించింది. కేంద్రం ఆదేశాలతో త్రైమాసిక రోడ్‌ ట్యాక్సీ వసూలుపై మినహాయింపునిచ్చింది.logo