శనివారం 30 మే 2020
Telangana - Apr 10, 2020 , 19:03:02

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ 5 కోట్ల విరాళం

తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ 5 కోట్ల విరాళం

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు ప్రముఖులు సీఎం రిలీప్‌ ఫండ్‌కు విరాళాలు అందజేస్తున్నారు. తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ. 5 కోట్ల చెక్కును విరాళంగా ఇచ్చింది. ఈ చెక్కును మంత్రి కేటీఆర్‌కు రిలయన్స్‌ జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ఆర్‌ఐఎల్‌ కార్పొరేట్‌ వ్యవహారాల అధికారి కమల్‌ పొట్లపల్లి అందజేశారు. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీకి, కేసీ రెడ్డికి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే పీఎం కేర్స్‌కు రిలయన్స్‌ రూ. 530 కోట్ల విరాళం ఇచ్చింది. 


logo