శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 02:32:43

ఉత్తమ అధ్యాపకుల జాబితా విడుదల

ఉత్తమ అధ్యాపకుల జాబితా విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ దినోత్సవం సంర్భంగా సంగీత, నృత్య కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురిని ఉత్తమ టీచర్లుగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రకటించారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలలో పనిచేస్తున్న ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లలో ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ ఎంపికచేసింది. శనివారం ఉత్తమ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల జాబితాను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌జలీల్‌ విడుదలచేశారు. ప్రిన్సిపాళ్ల క్యాటగిరీలో నలుగురు, జూనియర్‌ లెక్చరర్ల క్యాటగిరీలో ఆరుగురు, ఒకేషనల్‌ లెక్చరర్ల క్యాటగిరీలో ఒకరు, సంగీత, నృత్య కళాశాల క్యాటగిరీలో నలుగురుతోపాటు ఐదుగురికి ప్రత్యేక అవార్డులు ప్రకటించారు. 

అవార్డులు సాధించిన ప్రినిపాళ్లు, అధ్యాపకులు 

 • బీ ధన్‌రాజ్‌- నల్లగొండ 
 • బీ శ్రీధర్‌రావు- పెద్దపల్లి 
 • బీ సులోచన రాణి- భద్రాద్రికొత్తగూడెం 
 • కే నరేంద్రకుమార్‌- నల్లగొండ 
 • సయ్యద్‌ అబ్దుల్‌ హమీద్‌-హైదరాబాద్‌
 • టీ నరసింహా- నల్లగొండ 
 • ఆర్‌ జ్యోత్న్సరాణి-జనగామ  
 •  డీ రాజశేఖర్‌- నల్లగొండ 
 • ఎం రఘురాం- మహబూబ్‌నగర్‌
 • ఎస్వీ శైలజ- సికింద్రాబాద్‌  
 • పీ సెల్మా రాజకుమారి-  హైదరాబాద్‌ 

సంగీత, నృత్య క్యాటగిరీ.. 

 • కే రాజగోపాలాచారి- హైదరాబాద్‌ 
 • వీ దయాసాగర్‌- సికింద్రాబాద్‌ 
 • ఎం అనిత- నిజామాబాద్‌
 • టీ జైకిషన్‌- హైదరాబాద్‌ 

స్పెషల్‌ అవార్డులు..

 • ఎంజే సుశీల్‌కుమార్‌- ఓఎస్డీ
 • అబ్దుల్‌ ఖాలిక్‌- పరీక్షల నిర్వహణ అధికారి
 • వై శ్రీనివాస్‌- జాయింట్‌ సెక్రటరీ (పరీక్షలు)
 • బింబాదర్‌- సీఐవో బహుగుణసారథి- అకడమిక్‌ గైడెన్స్‌ ఆఫీసర్‌


logo