శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 15:51:22

ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటి విడుదల

ఎస్సారెస్పీ నుంచి వరద కాలువకు నీటి విడుదల

హైదరాబాద్‌ : శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి వరద కాలువకు గురువారం అధికారులు నీటిని విడుదల చేశారు. సుమారు ఎనిమిది టీఎంసీల నీటిని తరలించి మధ్యమానేరును నింపనున్నారు. ప్రస్తుతం ఐదు గేట్ల ద్వారా రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రం వరకు ఆరువేల క్యూసెక్కులకు పెంచనున్నారు. ప్రాజెక్టు ఎగువ భాగంలోని గైక్వాడ్‌ ప్రాజెక్టు ద్వారా రోజుకు పదివేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా.. వాటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 1090 అడుగల మేర నీరుండగా, 86 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గైక్వాడ్‌ ప్రాజెక్టు నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా డ్యామ్‌లో 86 టీఎంసీలకు తగ్గకుండా నీటిని నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1091 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్థం 90 టీఎంసీలు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo