శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 00:43:54

ల్యాబ్‌క్యూబ్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ విడుదల

ల్యాబ్‌క్యూబ్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆయుర్వేద మం దుల తయారీ సంస్థ ల్యాబ్‌క్యూబ్‌ రూపొందించిన ఇమ్యూనిటీ బూస్టర్‌ను హైదరాబాద్‌ అమీర్‌పేట గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. కొవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కిషన్‌రెడ్డి తెలిపారు. కషాయా లు మనలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెప్పా రు. ల్యాబ్‌క్యూబ్‌ మందులు తయారుచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే ఆయుర్వేద మందులతో స్ఫూర్తిపొంది యువత మరిన్ని ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ల్యాబ్‌క్యూబ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, కో ఫౌండర్‌ ఆరోగ్యరాజు పాల్గొన్నారు.

ఏపీలో వ్యాక్సిన్‌ డ్రై రన్‌కు ఏర్పాట్లు 

కరోనా టీకా పంపిణీ సమయంలో తలెత్తే ఇబ్బందులపై ముందస్తు అవగాహన కోసం డ్రై రన్‌ చేపట్టాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. కొవిన్‌ అనే ఎలక్ట్రానిక్‌ అప్లికేషన్‌ ద్వారా ముందుగా వ్యాక్సిన్‌ వేయాల్సిన అధికారుల జాబితాను రూపొందించింది. కృష్ణా జిల్లాలో ఎంపికచేసిన ఐదుప్రాంతాల్లో ఈ నెల 28న డ్రై రన్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. 


logo