సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 01:51:42

బాబ్లీ గేట్ల ఎత్తివేత

బాబ్లీ గేట్ల ఎత్తివేత

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 0.6 టీఎంసీల నీరు విడుదల

బాసర/ మెండోరా: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు ఐదుగేట్లను ఆదివారం ఎత్తి నీటిని వదిలారు. ఎస్సారెస్పీ పరిధిలోని ప్రాంత తాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ గేట్లను ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా మార్చి1న బాబ్లీ ప్రాజెక్టు నుంచి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉన్నది. బాబ్లీ ప్రాజెక్టులో 1.6 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. అందులోంచి 0.6 టీఎంసీల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు. 
logo