ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:20:53

ధరణి.. దేశంలో విప్లవాత్మకం

ధరణి.. దేశంలో విప్లవాత్మకం

  • నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు
  • వారం రోజుల్లో పాసు బుక్‌లు
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి: భూ క్రయవిక్రయాలకు సంబంధిం చి సులభంగా రిజిస్ట్రేషన్లు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌  దేశంలోనే విప్లవాత్మకమని ఆర్థికశాఖమంత్రి హరీశ్‌రావు పే ర్కొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది తాసి ల్‌ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మంత్రి పరిశీలించారు. ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ విధానాన్ని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ బర్కత్‌పురాకు చెం దిన చరణ్‌రాజ్‌ తన కుమారుడు అమర్‌నాథ్‌రాజ్‌ పేరున మండలంలో కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్‌ ప్రొసీడింగ్‌ను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా 570 రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పారు. 

15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి కొనుగోలుదారుని చేతిలో పాస్‌ బుక్కులు పెట్టేందుకు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మేలు జరిగే విధంగా కొత్త చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చారన్నారు. ఈ విధానంలో ఒరిజినల్‌ పట్టాదారు పాసు పుస్తకం వారం రోజుల్లోనే పోస్టులో ఇంటికి వస్తుందన్నారు. సాదాబైనామాలకు ప్రభుత్వం ఈ నెల 10 వరకు గడువు ఇచ్చిందని, తెల్లకాగితం, వారసత్వపరంగా వచ్చిన భూ మి, బుక్కులు చిరిగినా, కాలిపోయిన రైతులు కాస్తు లో ఉన్నావారు దరఖాస్తు చేసుకుంటే పైసా ఖర్చులేకుండా పట్టాదారు పాసు పుస్తకం ఇస్తుందన్నారు.