శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 03:08:55

9 ఏండ్ల పాపకు ఐరిస్‌తో రిజిస్ట్రేషన్‌

9 ఏండ్ల పాపకు ఐరిస్‌తో రిజిస్ట్రేషన్‌

కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారానికి చెందిన తమ్మిశెట్టి ఝాన్సీ 6 గుంటల భూమికి యజమానురాలైంది. పెరికసింగారం గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వీరయ్య, నాగలక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కూతురు ఝాన్సీ. చిన్నారి 4వ తరగతి చదువుతున్నది. తండ్రి వీరయ్య రెండేండ్ల కిందట మృతిచెందాడు. తల్లి కూలి పనులు చేస్తున్నది. వీరయ్య వాటాకు వచ్చిన 25 గుంటల్లో 15 గుంటల భూమిని తల్లి గార్డియన్‌గా కూతురు ఝాన్సీ పేరు మీద ఎక్కించారు. ఇటీవల నాగలక్ష్మి మరో 6 గుంటలు కొనుగోలు చేసింది. దానిని కూడా ఝాన్సీ పేరుమీద పాస్‌బుక్‌ చేయించాలనే ఆలోచన వచ్చింది. ధరణి గురించి తెలుసుకుని బుధవారం స్లాట్‌బుక్‌ చేసుకున్నది. గురువారం బిడ్డతో తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లింది. రిజిస్ట్రేషన్‌ చేస్తుండగా ఝాన్సీ వేలిముద్రలు పడలేదు. దీంతో అధికారులు ఐరిస్‌ సాయంతో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేశారు. 10 నిమిషాల్లోనే పట్టాదార్‌ పాస్‌బుక్‌లో నమోదుచేశారు. త్వరగా మ్యుటేషన్‌ చేయించి రిజిస్ట్రేషన్‌ కూడా అయిపోవడంతో నాగలక్ష్మి, ఝాన్సీ సంతోషంతో ఇంటికెళ్లారు.