గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:11:28

రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ రీషెడ్యూల్‌ ఒక్కసారే

రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ రీషెడ్యూల్‌ ఒక్కసారే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ధరణి రిజిస్ట్రేషన్లలో స్లాట్‌ రీషెడ్యూల్‌ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎడిట్‌ ఆప్షన్‌ ఇచ్చింది. వ్యవసాయ భూముల క్రయవిక్రయాల కోసం  రైతులు ఒకసారి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్నాక ఏ కారణంతోనైనా ఆ  సమయానికి తాసిల్దార్‌ కార్యాలనికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోతే తిరిగి మరో తేదీని ఎంచుకోవడానికి ధరణి  పోర్టల్‌లో అవకాశం కల్పించారు. ఈ మేరకు ఒక్కసారి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. దీని వల్ల రిజిస్ట్రేషన్‌ ఫీజు,  మ్యుటేషన్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఫీజులపై ప్రభావం పడదు. మొదటి సారి స్లాట్‌ బుక్‌ చేసుకునే ముందు చెల్లించిన ఫీజులనే స్లాట్‌ రీషెడ్యూల్‌కు కూడా పరిగణిస్తారు. అయితే రెండవసారి కూడా సమయానికి  రిజిస్ట్రేషన్‌ కోసం రాలేకపోతే మరోసారి స్లాట్‌ రీషెడ్యూల్‌ చేసుకొనే ఆస్కారం లేదు. రీషెడ్యూల్‌ చేసుకొన్న తర్వాత కూడా సమయానికి రాలేకపోతే ఏం చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.