గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 02:53:21

నాలుగేండ్ల పాటు తిరిగి తిరిగి..

నాలుగేండ్ల పాటు తిరిగి తిరిగి..

భూపాలపల్లి: ఈ ఫొటోలో రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందుకుంటున్నది బడితెల సమ్మయ్య. ఇతనిది జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాశీంపల్లి. 2016లో గ్రామానికి చెందిన చిత్తారి తారయ్య వద్ద 31 గుంటల వ్యవసాయ భూమిని కొని సాగు చేసుకొంటున్నాడు. అప్పటి నుంచి తన పేరిట ఉన్న భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టు తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఓపిక నశించి తిరుగడం మానుకొన్నాడు. కొన్న భూమి దగ్గరి బంధువుదే కావడంతో భూమి ఎక్కడికి  పోదని పట్టా చేసుకోలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భూములు వెంటనే రిజిస్ట్రేషన్‌ అవుతాయని, క్షణాల్లో చేతికి పట్టా ఇస్తారన్న విషయం తెలుసుకొని స్లాట్‌బుక్‌ చేసుకున్నాడు. తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్లి గంటలోపే భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని పట్టా అందుకున్నాడు. భూపాలపల్లి జాయింట్‌ రిజిస్ట్రార్‌ ఎం అశోక్‌కుమార్‌ చేతుల మీదుగా భూమి హక్కుపత్రాన్ని అందుకొని సంబురంగా ఇంటికి వెళ్లాడు.