సోమవారం 01 జూన్ 2020
Telangana - May 15, 2020 , 19:47:46

సరిపడేంత రక్తాన్ని ఇవ్వడానికి నర్సంపేట సిద్ధం

సరిపడేంత రక్తాన్ని ఇవ్వడానికి నర్సంపేట సిద్ధం

వరంగల్ రూరల్ : రాష్ట్రంలో ఉన్న కరోనా, తలసేమియా బాధితులను ఆదుకోవడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సూదర్శన్ రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు రక్తం సేకరిస్తున్నామన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో సేకరించిన 5,610 మంది రక్త దాతల జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే 1000 యూనిట్ల రక్తాన్నిఐఆర్ సీఎస్ ద్వారా ఒక్కరోజులోనే సేకరించి ప్రభుత్వానికి అందజేశామన్నారు. రాష్ట్రానికి సరిపడేంత రక్తాన్ని ఇవ్వడానికి నర్సంపేట సిద్ధంగా ఉందని వెల్లడించారు. 


logo