శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 09:43:27

తెలంగాణ ఎంసెట్ సిల‌బ‌స్ త‌గ్గింపు?

తెలంగాణ ఎంసెట్ సిల‌బ‌స్ త‌గ్గింపు?

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ వార్షిక ప‌రీక్ష‌ల‌ను 70 శాతం సిల‌బ‌స్‌తో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎంసెట్ సిల‌బ‌స్‌ను కూడా త‌గ్గించే అవ‌కాశం ఉంది. కొవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో 70 శాతం సిల‌బ‌స్‌తో ఫైన‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, మిగ‌తా 30 శాతం సిల‌బ‌స్‌ను అసైన్‌మెంట్స్‌, ప్రాజెక్టుల రూపంలో బోధించారు. అయితే ఇంట‌ర్ సిల‌బ‌స్ ఆధారంగానే ఎంసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. కాబ‌ట్టి ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌ను 70 శాతం సిల‌బ‌స్‌తో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించాల‌ని నేప‌థ్యంలో.. విద్యార్థుల‌పై భారం ప‌డ‌కుండా ఉండేందుకు ఎంసెట్‌ను కూడా అదే సిల‌బ‌స్‌తో నిర్వ‌హించేందుకు స‌న్నాహాకాలు చేస్తున్న‌ట్లు రాష్ర్ట ఉన్న‌త విద్యామండ‌లిలోని ఓ ఉన్న‌తాధికారి తెలిపారు. అయితే ఇంట‌ర్ సిల‌బ‌స్ కాపీ త‌మ‌కు చేరిన త‌ర్వాత ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకుని ఎంసెట్ సిల‌బ‌స్‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. తెలంగాణ ఎంసెట్‌ను జూన్ రెండో వారంలో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఇంట‌ర్ టైంటేబుల్ విడుద‌లైన త‌ర్వాత ఎంసెట్ ఎంట్రెన్స్ షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. ఇంట‌ర్ ఎగ్జామ్స్ ముగిశాక క‌నీసం మూడు వారాల స‌మ‌య‌మిచ్చి ఎంసెట్‌ను నిర్వ‌హిస్తామ‌న్నారు. 

VIDEOS

logo