సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 07:12:42

శాంతించిన గోదావరి.. 43 అడుగులకు నీటిమట్టం

శాంతించిన గోదావరి.. 43 అడుగులకు నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద ప్రవాహ ఉద్ధృతి సుమారు 13 అడుగుల మేర తగ్గింది. సోమవారం ఉదయానికి 6 గంటల వరకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సుమారు 10 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. నది ప్రవాహం తగ్గడంతో మొదటి ప్రమాదస్థాయి హెచ్చరికను సైతం అధికారులు మరికొన్ని గంటల్లో ఉపసంహరించనున్నారు. మరోవైపు భద్రాచలం పరిసరాల ప్రాంతాల్లో చేరిన వరద నీరు క్రమంగా తగ్గిపోయింది. నేటి నుంచి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఏజన్సీ మండలాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాలు రాకపోకలు కొనసాగడం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo