శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 01:47:41

30% తగ్గిన ఆర్టీసీ సర్వీసులు

30% తగ్గిన ఆర్టీసీ సర్వీసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చెరువుల కట్టలు తెగిన, రోడ్లు కొట్టుకుపోయిన, కోతకు గురైన మార్గాల్లో మాత్రం బస్సులు నడుపలేదని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) యాదగిరి ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మునుపటికంటే 30 శాతం మేర బస్సు సర్వీసులు తగ్గాయని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి నుంచి పరిస్థితిని సమీక్షించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నడిపామన్నారు. బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలు మినహా గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు మిగిలిన అన్ని జిల్లాల్లో అనేకచోట్ల బస్సు సర్వీసులను రద్దుచేశామని చెప్పారు. ప్రధానంగా పరిగి- తాండూరు మార్గంలోనూ రోడ్లు కోతకు గురై బస్సులను తిప్పే పరిస్థితి లేకుండా ఉన్నదని, మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌ మార్గంలో శంషాబాద్‌ వద్ద బుధవారం మధ్యాహ్నం వరద ఉధృతితో బస్సులు నడుపలేదన్నారు. నల్లగొండ జిల్లాలోనూ పలుచోట్ల బస్సు సర్వీసులను రద్దుచేయాల్సి వచ్చిందని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 11 గంటల తర్వాత 20-25 శాతం బస్సులను మాత్రమే నడిపామని వివరించారు.


logo