గురువారం 28 మే 2020
Telangana - May 02, 2020 , 06:52:06

రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్‌జోన్‌

రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్‌జోన్‌

  • ఆరెంజ్‌ 18.. గ్రీన్‌జోన్‌లో 9 జిల్లాలు
  • తీవ్రత ఆధారంగా విభజించిన కేంద్రం

హైదరాబాద్ : గతంలో నమోదైన కేసులు, వైరస్‌ వ్యాప్తి, తీవ్రత ఆధారంగా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌జోన్లలో మార్పులు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ అన్నిరాష్ర్టాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. తెలంగాణలో ఆరు జిల్లాలను కేంద్రం రెడ్‌జోన్‌గా ప్రకటించింది. 18 జిల్లాలను ఆరెంజ్‌ జోన్‌, 9 జిల్లాలను గ్రీన్‌జోన్‌గా గుర్తించింది. రెడ్‌, ఆరెంజ్‌ జోన్ల పరిధిలో తీసుకోవాల్సిన అప్రమత్త చర్యలను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్‌ ప్రభుత్వ కార్యదర్శులకు సూచించారు. రెడ్‌జోన్‌ జిల్లాలను విస్తృతి ఎక్కువగా (లార్జ్‌ ఔట్‌బ్రేక్‌) ఉన్నవి, కంటైన్మెంట్‌ క్లస్టర్లుగా విభజించారు. ఈ జిల్లాల్లో 21రోజులపాటు ఎలాంటి కేసులు నమోదుకాకపోతే గ్రీన్‌జోన్‌గా మార్పుచేస్తారు.  

తెలంగాణలో రెడ్‌జోన్‌ జిల్లాలు: హైదరాబాద్‌, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌.

ఆరెంజ్‌ జోన్‌: నిజామాబాద్‌, జోగుళాంబ గద్వాల, నిర్మల్‌, నల్లగొండ, ఆదిలాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, మెదక్‌, జనగామ, నారాయణపేట, మంచిర్యాల.

గ్రీన్‌జోన్‌: పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి.


logo