శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 01:47:52

ఎర్రబంగారం @ రూ.26 వేలు

ఎర్రబంగారం @ రూ.26 వేలు

  • సింగిల్‌పట్టి మిర్చికి రికార్డు ధర

కాశీబుగ్గ: వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో మిర్చి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ సీజన్‌లో అత్యధికంగా బుధవారం సింగిల్‌పట్టి రకం మిర్చికి క్వింటాల్‌కు రూ.26 వేల ధర లభించింది. గత నెలలో ఇదేరకం మిర్చి క్వింటాల్‌కు రూ.21,500 ధర పలుకగా,  సోమవారం రూ. 24,500, మంగళవారం రూ.25,500 ధర పలికింది. బుధవారం రూ.26 వేలకు చేరుకున్నది. తేజ, యుఎస్‌-341 రకం మిర్చికి సైతం ఈ సీజన్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.23, 500 ధర దక్కింది. ములుగు జిల్లా దేవగిరిపట్నం గ్రామానికి చెందిన రైతు వీ వెంకట్‌రెడ్డి ఐదు బస్తాల సింగిల్‌పట్టి మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా, క్వింటాల్‌కు రూ.26 వేల ధరతో ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌ డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు మార్కెట్‌కు 3.35 లక్షల క్వింటాళ్ల మిర్చి రాగా అందులో సింగిల్‌పట్టి రకం మిర్చి 300 క్వింటాళ్లు వచ్చినట్టు మార్కెట్‌ అధికారులు తెలిపారు. మిర్చికి పెద్దఎత్తున ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo