సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 01:58:43

మిర్చి @ 24 వేలు

మిర్చి @ 24 వేలు

  • వరంగల్‌లో ‘బ్యాడిగి’ రకానికి రికార్డు ధర

కాశీబుగ్గ, జనవరి 5: వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. బ్యాడిగి అనే కొత్త రకం మిర్చిని కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం మల్లన్నపల్లికి చెందిన రైతు జైపాల్‌రెడ్డి మూడు బస్తాలు మార్కెట్‌కు తీసుకువచ్చారు. ధర క్వింటాల్‌కు రూ.24 వేలు పలికింది. ఈ మిర్చి ద్వారా నూనె తీసి కెమికల్‌కు, కలర్స్‌కు ఉపయోగిస్తారని, దీన్ని ఎక్కువగా కర్ణాటకలో పండించేవారని, ఈ ఏడాది తెలంగాణలోని పలు జిల్లాల్లో పండించినట్టు అధికారులు తెలిపారు.


logo