సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 18:33:50

తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ

తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. రెడ్ అల‌ర్ట్ జారీ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్టాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. తూర్పు, మ‌ధ్య తెలంగాణ జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్‌, ఉత్త‌ర‌, ప‌శ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు జిల్లాల్లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసు శాఖ‌ను డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అప్ర‌మ‌త్తం చేశారు. అన్ని స్టేష‌న్ల ప‌రిధిలో పోలీసులు అందుబాటులో ఉండాల‌ని సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు వేగవంతం చేయాల‌ని ఆదేశించారు. 

ఇప్ప‌టికే కురుస్తున్న కుండ‌పోత వాన‌ల‌కు రాష్ర్టంలోని ప్రాజెక్టుల‌కు, చెరువుల‌కు జ‌ల‌క‌ళ వ‌చ్చింది. చెరువులు అలుగు పోస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి.  హైద‌రాబాద్ శివార్ల‌లోని హిమాయ‌త్ సాగ‌ర్‌కు వ‌ర‌ద పోటెత్తింది. దీంతో ఆ ప్రాజెక్టు గేట్లు ఎప్పుడైనా ఎత్తే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. logo