ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 02:13:28

రికవరీ రేటు 77.2 శాతం

రికవరీ రేటు 77.2 శాతం

  • 17.66 లక్షల కరోనా పరీక్షలు పూర్తి!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం రోజురోజుకు పెరుగుతున్నది. సకాలం లో చికిత్స అందిస్తుండటంతో రికవరీ రేటు 77.2 శాతానికి చేరుకున్నది. ఆదివారం 36 వేల పరీక్షలు కలుపుకొని ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17.66 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసినట్టు వైద్యారోగ్యశాఖ సో మవారం బులెటిన్‌లో పేర్కొన్నది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఆదివారం 1,802 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలిం ది. జిల్లాల్లో నమోదైన కేసులు పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డిలో 158, కనిష్ఠంగా జయశంకర్‌ భూపాలపల్లిలో ఒక కేసు నమోదైంది.

కరోనాతో ఆదిలాబాద్‌ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మృతి

ఆదిలాబాద్‌ రూరల్‌: ఆదిలాబాద్‌ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజన్న మృ తిచెందారు. పది రోజుల కిందట కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించగా ఆదివారం ప్రాణాలు వదిలా రు. సోమవారం చాంద(టి)లో అంత్యక్రియలు నిర్వహించారు. 


logo