సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 02:22:03

రికవరీ రేటు 97.81%

రికవరీ రేటు 97.81%

హైదరాబాద్‌, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం తెలంగాణలో 97.81శాతానికి చేరుకోగా, జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.4 శాతం ఉన్నది. ఒక్కరోజే 37 వేల పరీక్షలు నిర్వహించగా, 351 మం దికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 65, రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్‌లో 28 కేసులు వెలుగుచూశాయి.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు


వివరాలు
శనివారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
351
2,89,784
డిశ్చార్జి అయినవారు
415
2,83,463
మరణాలు
2
1565
చికిత్స పొందుతున్నవారు
-
4,756logo