బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 11, 2020 , 00:40:58

త్వరలో పీఆర్సీ నివేదిక?

త్వరలో పీఆర్సీ నివేదిక?
  • ప్రభుత్వానికి అందించేందుకు తుదిమెరుగులు
  • ఉద్యోగ విరమణ వయసుపెంపునకు సిఫారసు!

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన తొలి పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) అతి త్వరలో నివేదిక సమర్పించే అవకా శం ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల, కార్పొరేషన్ల ఉద్యోగులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికకు కమిషన్‌ తుదిమెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఉద్యోగ విరమణ వయస్సు పెంపునకు కమిషన్‌ సిఫారసుచేసే అవకాశం ఉండటంతో నివేదికపై సీనియర్‌ ఉద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నా రు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిస్వాల్‌ చైర్మన్‌గా 2018 మే 24న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర తొలి ‘పే రివిజన్‌ కమిషన్‌' అన్నింటికి మార్గదర్శిగా ఉండేలా నివేదిక రూపొందించాలని నిర్ణయించింది.


ఏర్పాటుకాగానే తన పనిని మొదలుపెట్టిన కమిషన్‌.. అన్ని ఉద్యోగ సంఘా లు, ఉద్యోగులు, శాఖలవారీగా అధికారుల నుం చి అభిప్రాయాలు సేకరించింది. వివిధ కారణాల వల్ల పీఆర్సీ గడువును ప్రభుత్వం రెండుసార్లు పెంచింది. ప్రస్తుతం విధించిన గడువు ఈ నెల 24తో ముగియనున్నది. ఆలోగానే నివేదిక ఇవ్వడానికి కమిషన్‌ కసరత్తును వేగవంతంచేసినట్టు తెలిసింది. పీఆర్సీ కమిషన్‌ ఉద్యోగుల బిజినెస్‌ రూల్స్‌పై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలవారీగా, శాఖలవారీగా మంజూరైన పోస్టులు ఎన్ని? ఎంతమంది ఉద్యోగులున్నారు? ఖాళీలు ఎన్ని? కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఎంతమంది? తదితర లెక్కలు తీసుకున్నట్టు తెలిసింది. వీటిని క్రోడీకరించి కొత్త జిల్లాలవారీగా ఉద్యోగుల క్యాటగిరీలను కూడా విభజిస్తూ నివేదికలో పొందుపరిచే అవకాశమున్నది. 


logo