బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 20:35:38

కిడ్నీ బాధితుడికి మంత్రి కొప్పుల భరోసా

కిడ్నీ బాధితుడికి మంత్రి కొప్పుల భరోసా

జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన బీటెక్ విద్యార్థి గాలిపెల్లి సాయిరామ్‌ రెండు కిడ్నీలు దెబ్బతిని మంచానికే పరిమితమయ్యాడు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందగా తల్లి కూలీ చేస్తేనే పూట గడవని దుస్థితి. రెక్కాడితేగానీ డొక్కాడని స్థితిలో కార్పొరేట్ వైద్యం చేయించుకోలేక బతుకుపోరాటం చేస్తున్న  సాయిరామ్ దీనావస్థ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన సాయిరామ్‌తో ఫోన్లో మాట్లాడి చికిత్సకు అన్నివిధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో సాయిరామ్‌ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఖర్చుల నిమిత్తం జడ్పీటీసీ సుధారాణి రామస్వామి రూ.5 వేలు, ఎంపీటీసీ పెద్దూరి హారికా భరత్ రూ.5 వేలు సాయిరామ్‌ కుటుంబానికి అందజేశారు. వారి వెంట టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు గుండా జగదీశ్వర్, గంట్యాల రాజేందర్, హనుమాన్ యూత్ సభ్యులు తదితరులున్నారు.

తాజావార్తలు


logo