e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home తెలంగాణ సైనికులే నిజమైన హీరోలు

సైనికులే నిజమైన హీరోలు

  • వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ తోడ్పాటు మరువలేనిది
  • ఎయిర్‌ కమాండర్‌ టీఎస్‌ఎస్‌ క్రిష్ణన్‌
సైనికులే నిజమైన హీరోలు

సూర్యాపేట టౌన్‌, జూలై 22: దేశ రక్షణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సైనికులే నిజమైన హీరోలని ఎయిర్‌ కమాండర్‌ టీఎస్‌ఎస్‌ క్రిష్ణన్‌ పేర్కొన్నారు. దేశ రక్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని చెప్పారు. గురువారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహానికి జిల్లా ఎస్పీ భాస్కరన్‌తో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రిష్ణన్‌ మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటు దేశంలోని సైనికుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఏడాదిలోపే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ చౌరస్తాకు సంతోషబాబు పేరు పెట్టడం గర్వంగా ఉన్నదని చెప్పారు. మాతృభూమి రుణం తీర్చుకొనేందుకు యువత సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కర్నల్‌ వినయ్‌ డాఖా, కర్నల్‌ ఎంసీఎస్‌ రావు, విశ్రాంత సైనికుడు కర్నల్‌ శ్రీనివాస్‌రావు, సంతోష్‌బాబు తల్లిదండ్రులు ఉపేందర్‌, మంజుల పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సైనికులే నిజమైన హీరోలు
సైనికులే నిజమైన హీరోలు
సైనికులే నిజమైన హీరోలు

ట్రెండింగ్‌

Advertisement