శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 12:30:39

హైదరాబాద్ లో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్....

 హైదరాబాద్ లో జోరందుకుంటున్న రియల్ ఎస్టేట్....

హైదరాబాద్ : కరోనా మహమ్మారి, లాక్ డౌన్  ఎఫెక్ట్ తో కుదేలైన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కాస్త ఊపందు కుంటున్నది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ కరోనా కారణంగా దెబ్బతింది. అయితే  దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని రియల్ ఎస్టేట్ బిజినెస్ తో పోలిస్తే లో  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా ప్రభావం చుపించలేదని ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంపై కరోనా పై తీవ్ర ప్రభావం నెలకొందని, ఊహించని విధంగా రియల్ ఎస్టేట్ రంగం నష్టాల్లో మునిగిపోయిందని పలు సంస్థలు నివేదికలు ఇచ్చాయి. భవిష్యత్ లో కూడా అంత త్వరగా కోలుకునే పరిస్థితులు లేవని పలు ప్రాపర్టీ సంస్థలు నివేదికలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ రిపోర్ట్స్ ను తలకిందులు చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నది.

అనరాక్, నైట్ ఫ్రాంక్ వంటి రియల్ ఎస్టేట్ సంస్థలు దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని, భూముల ధరలు తగ్గాయని ప్రకటించాయి. క్షేత్రస్థాయిలో అటువంటి ప్రభావం లేదని బిల్డర్లు, డెవలపర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. కరోనా కారణంగా దేశమంతా అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గినా అందుకు భిన్నంగా హైదరాబాద్ మార్కెట్ ఉంది. లాక్ డౌన్ సమయంలో ఎవరూ బయటికి రాకపోవడంతో అమ్మకాలు తగ్గాయని, ప్రస్తుతం భూములు, ఫ్లాట్ల కొనుగోలు కోసం కస్టమర్లు బాగానే వస్తున్నట్లుగా చెప్తున్నారు. అంతేకాదు ధరలు తగ్గించాల్సిన అవసరం కూడా రాలేదని రియల్టర్లు చెబుతున్నారు.

హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నం... 

 ఒకపక్క పూణే, ముంబై, చెన్నై, బెంగళూర్, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటే, హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్మకాలు 85శాతం తగ్గుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతే కాదు 2020 - 21 మొదటి మూడు నెలల క్వార్టర్ లో కొత్త ఇండ్ల అమ్మకాలు ,ఫ్లాట్ల అమ్మకాలు 660 కి మించవని అంచనా వేశారు.

అటువంటి అంచనాలకు భిన్నంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. కరోనా ప్రభావం కూడా తగ్గడంతో నిధానంగా వ్యాపారం ఊపు అందుకుంటున్నదని రియల్టర్లు చెబుతున్నారు. ఈ పరిణామాలతో ప్రస్తుతం రియల్టర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కాస్త కోలుకోవటం తెలంగాణా రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త ఊరట . హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలో వరంగల్ తదితర ప్రధాన నగరాల్లో కూడా మార్కెట్ నెమ్మదిగా పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.