పోషకాహార లోప నివారణ ప్రతిపాదనల అమలుకు సిద్ధం

హైదరాబాద్ : తెలంగాణలో పోషకాహార లోపం ఎక్కడ ఉండకూడదన్న ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని కావున వెంటనే దీనికనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు. స్ర్తీలు, శిశువుల్లో పోషకాహార లోపం నివారణకు చేపట్టాల్సిన చర్యలపై గురువారం హైదరాబాద్ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్మితా సబర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మీ పథకం, గర్భిణీలు పనికి వెళ్లకుండా ఉండేందుకు ఆరు నెలల పాటు ఇచ్చే రూ. 12 వేలు వంటి పథకాలు విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయన్నారు. అదేవిధంగా మరో అద్భుతమైన కార్యక్రమం ద్వారా తెలంగాణలోని శిశువుల్లో పోషకాహార లోపం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రాష్ట్రంలో మహిళలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం పోషకాహారాన్ని అందించేందుకు అంగన్వాడీల తరపున తీసుకుంటున్న చర్యలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖల ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య ఈ సందర్భంగా వివరించారు. 7 నెలల నుంచి 3 ఏళ్ల వరకు, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు గల పిల్లల కోసం అంగన్వాడీల ద్వారా బాలామృతం, గుడ్లు ఇస్తున్నామన్నారు. పాలు ఇవ్వడం వల్ల మరింత మంచి ఫలితాలు వస్తాయన్నారు.
సమావేశంలో అంగన్వాడీ కేంద్రాలలో బాలురు, బాలికల ఎదుగుదలను నమోదు చేసి తల్లిదండ్రులకు ఇచ్చే పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డును మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులు ఆవిష్కరించారు. ఇందులో పిల్లల ఎదుగుదలను నమోదు చేయడమే కాకుండా, ఆరోగ్యకరమైన పిల్లలు ఎలా ఉండాలనేది కూడా ముద్రించామని దానికనుగుణంగా తల్లిదండ్రుల పిల్లల ఎదుగుదల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించే అవకాశం ఉందన్నారు.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు
- గొలుసుకట్టు మోసం.. 24 మంది అరెస్టు
- ట్విట్టర్లో మహిళలు ఏం పోస్ట్ చేస్తున్నారంటే..?
- పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్
- కోతులకు కల్లు ప్యాకెట్ దొరికితే ఊరుకుంటాయా.. ఓ పట్టుపట్టేశాయ్: వీడియో
- ఒక్కరోజే 15 లక్షల మందికి టీకాలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు