గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 13:21:31

చదివింది పదే.. చేసేది మాత్రం డాక్టర్‌ వృత్తి

చదివింది పదే.. చేసేది మాత్రం డాక్టర్‌ వృత్తి

హైదరాబాద్ : అతను చదివింది పదే.. చేసేది మాత్రం డాక్టర్‌ వృత్తి.. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు ఫేక్ డాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌ అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చోటుచేసుకుంది. ప్రైవేట్ దవాఖానలో ఫేక్ సర్టిఫికెట్‌తో డాక్టర్‌గా అవతారం ఎత్తాడు ఓ వ్యక్తి. అతను చదివింది పదో తరగతే కానీ ఫేక్‌ సర్టిఫికెట్లతో డాక్టర్‌గా చలామణి తవుతున్నాడు. ఈ విషయం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో వారు రెడ్‌హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నారు.

నకిలీ డాక్టర్‌తో పాటు ఆ దవాఖాన యజమాని షోహెబ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫేక్‌ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరికి సర్టిఫికేట్స్ ఎవరు ఇచ్చారు..? ఏ యూనివర్శిటీ అయినా డబ్బులకు ఇచ్చిందా.? లేకా టెక్నాలజీ సాయంతో మార్చేశారా..? అనే కోణంలో పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo